ఢిల్లీలో బాలికలపై అత్యాచారాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో బాలికలపై అత్యాచారాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. దేశ రాజధానిలో పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో మోదీని ప్రశాంతంగా నిద్రపోనివ్వనని పేర్కొన్నారు. 'నేను షీలా దీక్షిత్ను కాను. ప్రధానిని సైతం నేను పడుకోనివ్వను. తరచూ విదేశాలకు వెళ్లే ఆయన ఎందుకు రేప్ బాధితుల కుటుంబసభ్యులను పరామర్శించడం లేదు' అని ఆయన ఆదివారం విలేకరులతో అన్నారు.
ఢిల్లీలో ఇద్దరు బాలికలపై అత్యాచారాలు జరిగిన నేపథ్యంలో ఈ ఘటనలపై సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్తో భేటీ అయ్యారు. ఢిల్లీ పోలీసులను కేంద్ర ప్రభుత్వ పరిధి నుంచి తప్పించి.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తేవాలని, అప్పుడే హస్తినలో నేరాలను నియంత్రించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.