పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలి | Hyderabad journalists condemn attack on scribes in Delhi | Sakshi
Sakshi News home page

పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలి

Feb 19 2016 3:59 AM | Updated on Apr 3 2019 8:51 PM

పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలి - Sakshi

పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలి

తనపై దాడిచేసిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి డిమాండ్ చేశారు.

పాశం యాదగిరి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తనపై దాడిచేసిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి డిమాండ్  చేశారు. మేడారం జాతరలో ఆయనపై పోలీసులు జరిపిన దాడిని నిరసిస్తూ గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దీక్షకు సిద్ధంకాగా పలువురు సీనియర్ పాత్రికేయుల విజ్ఞప్తి మేరకు విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసులు యూనిఫాంలో ఉన్న రాక్షసులుగా మారారని, వారిని మనుషులుగా మార్చాల్సిన అవసరముందని అన్నారు. మేడారం జాతర దేవాదాయ, అటవీ, రెవిన్యూ శాఖల ఆధ్వర్యంలో జరగడంలేదని కేవలం పోలీసుల ఆధ్వర్యంలోనే జరుగుతోందన్నా.

దీనికి సీఎం కేసీఆర్ సమాధా నం చెప్పాలన్నారు. అయితే, పాశం యాదగిరికి పలు కులసంఘాలు, ఉద్యమ సంఘాలు సంఘీ భావం తెలిపాయి. దాడికి పాల్పడిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సంఘాల నేతలు హెచ్చరించారు.
 
యాదగిరిపై దాడిని ఖండించిన నేతలు
సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిపై పోలీసుల దాడిని పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.  దాడి చేసిన పోలీసులపై తక్షణమే చర్యలను తీసుకోవాలని, ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. యాదగిరిపై దాడి చేసిన పోలీసుఅధికారి విశ్వజిత్‌కు మానసిక రుగ్మత ఉన్నదని, ఇలాంటి పోలీసు అధికారుల వల్ల పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వ్యాఖ్యానిం చారు. న్నారు. పాశం యాదగిరిపై, వైద్య సిబ్బందిపై పోలీసుల దాడిని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఖండించారు.
 
డీజీపీని కలసిన జర్నలిస్టు సంఘాలు
యాదగిరిపై దురుసుగా ప్రవర్తించిన ఏఎస్‌పీ చర్యలు తీసుకోవాలని డీజీపీ అనురాగ్‌శర్మను ప్రెస్ అకాడమీ ైచె ర్మన్ అల్లం నారాయణ  కలసి వినతి పత్రం అందజేశారు. ఘటనపై వరంగల్ డీ ఐజీ మల్లారెడ్డిని విచారణకు ఆదేశించామని డీజీపీ తెలిపారు. డీజీపీని కలిసినవారిలో టీయూడ బ్ల్యూజే నేతలు క్రాంతికుమార్, పల్లె రవికుమార్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement