రసాయనిక పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం | Huge fire accident in Chemical industry | Sakshi
Sakshi News home page

రసాయనిక పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Oct 5 2015 10:24 PM | Updated on Sep 13 2018 5:04 PM

రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలోని దూలపల్లి పారిశ్రామిక వాడలో ఓ కంపెనీలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

కుత్బుల్లాపూర్: రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలోని దూలపల్లి పారిశ్రామిక వాడలో ఓ కంపెనీలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని గోదాములో నిల్వ ఉంచిన రసాయనాలకు మంటలు అంటుకోవడంతో భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement