షూటింగ్ లో హీరోకు తిరగబెట్టిన గాయం | Hero Ajith injures his ankle again on the set of Vedalam | Sakshi
Sakshi News home page

షూటింగ్ లో హీరోకు తిరగబెట్టిన గాయం

Oct 17 2015 7:22 PM | Updated on Sep 3 2017 11:06 AM

షూటింగ్ లో హీరోకు తిరగబెట్టిన గాయం

షూటింగ్ లో హీరోకు తిరగబెట్టిన గాయం

వేదాళమ్ షూటింగ్‌లో నటుడు అజిత్ కాలుకు బలమైన దెబ్బ తగిలింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సలు అందించారు.

చెన్నై: వేదాళమ్ షూటింగ్‌లో ప్రముఖ హీరో అజిత్ కాలు మడమకు మరోసారి గాయమైంది. అయితే గాయం బాధిస్తున్నా ఆయన మాత్రం షూటింగ్ ను పూర్తి చేయటం విశేషం. అజిత్ నటిస్తున్న వేదాళమ్ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. చిత్ర పాటల చిత్రీకరణ  స్థానిక పెరంబూర్‌లోని బిన్ని మిల్లులో జరుగుతోంది. గురువారం పలువురు నృత్య కళాకారులతో కలిసి అజిత్ ఆడిపాడే సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా అనూహ్యంగా ఆయన  కుడి కాలు పట్టుకుని బాధతో విలవిలలాడారు.

దీంతో చిత్ర దర్శకుడు షూటింగ్ క్యాన్సిల్ చేయాలని సూచించినా స్పాట్ లోనే ట్రీట్మెంట్ తీసుకున్న అజిత్ గాయాన్ని కూడా లెక్కచేయకుండా  పాటను  కంటిన్యూ చేశాడట.  ఈ సంఘటనపై అజిత్ సన్నిహితులు మాట్లాడుతూ....గతంలో 'ఆరంభం'  సినిమాలో నటించినప్పుడు కారు అదుపు తప్పి ఆయన కాలు మీదగా వెళ్లడంతో కాలుకు తీవ్ర గాయమైందని.... అప్పట్లో వైద్య చికిత్స అనంతరం అజిత్ కొంత కాలం విశ్రాంతి తీసుకున్నారని చెప్పారు. అయితే  ఇపుడు అదే కాలు మడమకు ఒత్తిడి ఎక్కువ అవటంతో నొప్పి తిరగబెట్టినట్లు చెప్పారు. ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement