బాలయ్య సినిమాపై మెగా హీరో ట్వీట్ | Hearing great reports about GPSK | Sakshi
Sakshi News home page

బాలయ్య సినిమాపై మెగా హీరో ట్వీట్

Jan 12 2017 11:43 AM | Updated on Aug 29 2018 1:59 PM

నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చాలా బాగుందని నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో మెగా హీరో సాయి ధరం తేజ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి గొప్ప రిపోర్టులు అందుతున్నాయని, ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు, దర్శకుడు క్రిష్ కు శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ గారు తమలో చాలామందికి స్ఫూర్తిగా నిలిచారని ఆయన ఫొటో పెట్టి మరీ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement