ఒబామా పర్యటనకు భారీ భద్రత: రాజ్నాథ్ | Govt taking steps for security ahead of Obama's visit, says Rajnath Singh | Sakshi
Sakshi News home page

ఒబామా పర్యటనకు భారీ భద్రత: రాజ్నాథ్

Dec 18 2014 9:51 PM | Updated on Sep 2 2017 6:23 PM

ఒబామా పర్యటనకు భారీ భద్రత: రాజ్నాథ్

ఒబామా పర్యటనకు భారీ భద్రత: రాజ్నాథ్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఎక్కడా రాజీపడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 'ఒబామా పర్యటనకు భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాల్సివుంటుంది. మేం అదే చేస్తున్నాం. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఎప్పటికప్పడు అప్రమత్త సందేశాలు పంపుతున్నాం' అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.

పాకిస్థాన్ లోని పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై విలేకరులకు అడిగిన ప్రశ్నకు ఆయనీవిధంగా స్పందించారు. గణతంత్ర దినోత్సవానికి ఒబామా అతిథిగా రానున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోనూ దాడులు జరిగే అవకాశముందన్న నిఘావర్గాల సమాచారాన్ని కొట్టిపారేయలేమని రాజ్నాథ్ సింగ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement