కన్నకూతురిపై మూడేళ్ల పాటు అత్యాచారం!! | Girl raped by father for three years | Sakshi
Sakshi News home page

కన్నకూతురిపై మూడేళ్ల పాటు అత్యాచారం!!

Mar 19 2014 2:34 PM | Updated on Jul 28 2018 8:51 PM

కన్నకూతురిపై మూడేళ్ల పాటు అత్యాచారం!! - Sakshi

కన్నకూతురిపై మూడేళ్ల పాటు అత్యాచారం!!

కన్నతండ్రి అఘాయిత్యాన్ని ఆమె తనకు తెలిసీ తెలియని వయసులో పంటిబిగువున సహించింది. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే జరగడంతో ఆ అకృత్యాన్ని బయటపెట్టింది.

కన్నతండ్రి అఘాయిత్యాన్ని ఆమె తనకు తెలిసీ తెలియని వయసులో పంటిబిగువున సహించింది. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే జరగడంతో ఆ అకృత్యాన్ని బయటపెట్టింది. అవును.. కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన కన్న తండ్రే ఏకంగా మూడేళ్ల పాటు వరుసగా అత్యాచారం చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. దాంతో దినేష్ సోనీ (51)ని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలికి 9 నుంచి 12 ఏళ్ల వరకు వయసు ఉన్నప్పుడు దినేష్ సోనీ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్హెచ్ఓ రాజేష్ మాలిక్ తెలిపారు.

ఇప్పుడు ఆమెకు 21 సంవత్సరాలు. ఈ జనవరి లోనే పెళ్లి కూడా అయ్యింది. హోలీ సంబరాల కోసం పుట్టింటికి వచ్చినప్పుడు మరోసారి తనపై తండ్రి అత్యాచారం చేయబోగా తప్పించుకుని, పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతగాడిని అరెస్టు చేసి ఐపీసీ లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కుటుంబంలోని ఇతర సభ్యులకు కూడా ఈ ఘోరం గురించి తెలిసినా.. ఫిర్యాదుచేసే ధైర్యం చేయలేకపోయినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. తమ తండ్రి తన పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలి చెల్లెలు పోలీసులవద్ద వాపోయింది. బంగారం దుకాణం నడిపే దినేష్ సోనీకి తాగుడు అలవాటుందని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement