తుపాకీతో బెదిరించి యువతిపై అత్యాచారం | Girl gangraped at gunpoint in front of brother | Sakshi
Sakshi News home page

తుపాకీతో బెదిరించి యువతిపై అత్యాచారం

Feb 2 2014 10:31 PM | Updated on Jul 28 2018 8:51 PM

తుపాకీతో బెదిరించి సోదరుడి ముందే ఓ యువతిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.


 ముజఫర్‌నగర్: తుపాకీతో బెదిరించి సోదరుడి ముందే ఓ యువతిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని సహ్రన్‌పూర్ జిల్లాలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు తన సోదరుడితో కలిసి సహ్రన్‌పూర్ నుంచి కర్నాల్ వెళ్తోంది. మార్గమధ్యంలో లిఫ్ట్ అడిగి వారు ఓ వాహనంలో ఎక్కారు. అయితే అందులో ఉన్న నలుగురు యువకులు వాహనాన్ని దారి మళ్లించి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. సోదరుడిని నిర్బధించి, తుపాకీతో బెదిరించి యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

 

ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించి అక్కడ్నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ ధర్మేందర్ సింగ్  చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement