గెలుస్తానని అనుకోలేదు:నటి గౌహార్ ఖాన్ | Gauhar Khan wins Bigg Boss 7 | Sakshi
Sakshi News home page

గెలుస్తానని అనుకోలేదు:నటి గౌహార్ ఖాన్

Dec 29 2013 9:11 PM | Updated on Sep 2 2017 2:05 AM

గెలుస్తానని అనుకోలేదు:నటి గౌహార్ ఖాన్

గెలుస్తానని అనుకోలేదు:నటి గౌహార్ ఖాన్

బిగ్‌బాస్ రియాలిటీ షో విజేతగా నిలిచిన నటి గౌహార్ ఖాన్ తాను తన చివరి ప్రత్యర్థిని ఓడిస్తానని అనుకోలేకపోయానని చెప్పింది.

ముంబై: బిగ్‌బాస్ రియాలిటీ షో విజేతగా నిలిచిన నటి గౌహార్ ఖాన్ తాను తన చివరి ప్రత్యర్థిని ఓడిస్తానని అనుకోలేకపోయానని చెప్పింది. ‘పోటీలో నేను గెలుస్తాననే ధీమాతో ఉన్నాను. నలుగురు ఫైనలిస్టులు బరి నుంచి వెళ్లిపోయాక తనిషా ముఖర్జీ, నేనే మిగిలాం. నేను తనీషాపై గెలవలేనని అనుకున్నాను. తనీషా అమ్మ తనూజాజీని చూడగానే విజయం తనూషాదేనని అనుకున్నాను. అయితే నేనే విజేతనని ప్రకటించగానే షాక్‌తో నమ్మలేకపోయాను’ అని పేర్కొంది.

 

శనివారం ముగిసిన బిగ్‌బాగ్ టీవీ రియాలిటీ షో-7లో గౌహార్ ఖాన్ విజేతగా నిలిచింది. ఈ షోలో పోటీదారులను 104 రోజులపాటు ఓ ఇంట్లో ఉంచి వివిధ అంశాల్లో వారి ప్రతిభ ఆధారంగా విజేతను ఎంపిక చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement