
'రాజకీయ కుట్ర జరుగుతోంది'
తమ ప్రభుత్వాన్ని కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక సర్కారుగా ముద్ర వేసేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు.
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వాన్ని కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక సర్కారుగా ముద్ర వేసేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. దీన్ని ఒకవర్గం మీడియా హైలెట్ చేస్తోందని అన్నారు. భూసేకరణ బిల్లుకు విపక్షాలు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనీ ఆరోపణలు చేశారు.
అన్నదాతల బాగుకోసమే భూసేకరణ బిల్లు తెచ్చామని గడ్కరీ స్పష్టం చేశారు. బిల్లులో ప్రతిపాదించిన ఐదు సవరణల్లో ఒక్కటైనా రైతులకు వ్యతిరేకంగా ఉందని నిరూపించాలని సవాల్ చేశారు. తమ ప్రభుత్వం రైతులకు, షెడ్యూల్ కులాలకు, తెగలకు వ్యతిరేకమన్న ముద్ర వేసేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.