అసభ్య ఎంఎంఎస్తో వివాహితకు బెదిరింపు | Four men booked for making obscene MMS of married woman | Sakshi
Sakshi News home page

అసభ్య ఎంఎంఎస్తో వివాహితకు బెదిరింపు

Feb 15 2014 7:38 PM | Updated on Sep 2 2017 3:44 AM

బలవంతంగా ఓ వివాహితకు సంబంధించిన అసభ్య ఎంఎంఎస్ తయారు చేయడమే కాక, తమకు లక్ష రూపాయలు ఇవ్వకపోతే దాన్ని ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు నలుగురు ప్రబుద్ధులు.

బలవంతంగా ఓ వివాహితకు సంబంధించిన అసభ్య ఎంఎంఎస్ తయారు చేయడమే కాక, తమకు లక్ష రూపాయలు ఇవ్వకపోతే దాన్ని ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు నలుగురు ప్రబుద్ధులు. 29 ఏళ్ల ఆ వివాహిత తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి ఉండగా, జనవరి 15వ తేదీన ఆ నలుగురు నిందితులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి కత్తులతో బెదిరించారు. తర్వాత ఆమెను అసభ్యంగా తయారుచేసి, దాన్నంతటినీ తమ ఫోన్లో వీడియో తీశారు.

అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న రూ. 25వేలు బలవంతంగా లాక్కెళ్లి, తర్వాత మరో లక్ష రూపాయలు ఇవ్వకపోతే ఆ ఎంఎంఎస్ను ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేస్తామని బెదిరించారు. బాధితురాలి స్టేట్మెంటును పోలీసులు రికార్డు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులందరూ బాధితురాలికి తెలిసున్నవారే. సమీప ప్రాంతాల్లో రికార్డయిన సీసీటీవీ ఫుటేజిలను చూసి నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement