అసభ్య ఎంఎంఎస్తో వివాహితకు బెదిరింపు
బలవంతంగా ఓ వివాహితకు సంబంధించిన అసభ్య ఎంఎంఎస్ తయారు చేయడమే కాక, తమకు లక్ష రూపాయలు ఇవ్వకపోతే దాన్ని ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు నలుగురు ప్రబుద్ధులు. 29 ఏళ్ల ఆ వివాహిత తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి ఉండగా, జనవరి 15వ తేదీన ఆ నలుగురు నిందితులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి కత్తులతో బెదిరించారు. తర్వాత ఆమెను అసభ్యంగా తయారుచేసి, దాన్నంతటినీ తమ ఫోన్లో వీడియో తీశారు.
అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న రూ. 25వేలు బలవంతంగా లాక్కెళ్లి, తర్వాత మరో లక్ష రూపాయలు ఇవ్వకపోతే ఆ ఎంఎంఎస్ను ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేస్తామని బెదిరించారు. బాధితురాలి స్టేట్మెంటును పోలీసులు రికార్డు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులందరూ బాధితురాలికి తెలిసున్నవారే. సమీప ప్రాంతాల్లో రికార్డయిన సీసీటీవీ ఫుటేజిలను చూసి నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.