
ఘజియాబాద్: ఉత్తరాది అంతటా ప్రస్తుతం శ్రావణమాస శోభ నెలకొంది. భక్తులు ఆలయాలను సందర్శిస్తూ పూజాదికాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాంసాహారం విక్రయించడం తగదంటూ, యూపీలోని ఘజియాబాద్‌లో హిందూ రక్షా దళ్ సభ్యులు ప్రముఖ కేఎఫ్‌సీ అవుట్‌లెట్ ముందు ఆందోళనకు దిగారు. శ్రావణ మాసం అంతటా మాంసం విక్రయాలను నిలిపివేయకపోతే నిరసనలు తీవ్రతరం అవుతాయని వారు హెచ్చరించారు.
ఘజియాబాద్ మీదుగా కన్వర్ యాత్ర సాగుతున్న తరుణంలో తలెత్తిన ఈ పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులను సంఘటనా స్థలానికి చేరుకుని, నిరసనకారులను శాంతింపజేశారు. ఈ ఘటన అనంతరం సదరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అవుట్‌లెట్.. ఈ శ్రావణమాసం అంతటా తాము కేవలం శాఖాహారం మాత్రమే అందిస్తామంటూ ఒక నోటీసును అతికించింది. పోలీసులు ఈ ఉదంతంపై దర్యాప్తు ప్రారంభించారు. అల్లర్లకు పాల్పడినవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
UTTER IDIOCY: a self styled Hindu vigilante group storms a KFC outlet in Ghaziabad and forces it to shut down, saying can’t sell meat during the month of Sawan. Please don’t eat chicken, but why stop others? And why are cops missing in action yet again ? JIYO AUR JEENE DO for… pic.twitter.com/NYdczVhZpn
— Rajdeep Sardesai (@sardesairajdeep) July 18, 2025
నెల రోజుల పాటుసాగా కన్వర్ యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ యాత్రలో భక్తులు పవిత్ర గంగా జలాన్ని సేకరించి, శివునికి అభిషేకం చేస్తారు. కన్వర్ యాత్రికుల ప్రయాణం సజావుగా సాగేందుకు ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు జాతీయ రహదారిపై ఒక లేన్‌ను వారికోసం ప్రత్యేకంగా కేటాయించారు. జూన్ 10న ప్రారంభమైన కన్వర్ యాత్ర నెల రోజుల పాటు జరగనుంది.