
నాన్న అంటే త్యాగం, బాధ్యత. వాటిని పక్కనపెట్టి తన సౌఖ్యం చూసుకుంటే కుటుంబం ఏవిధంగా చిన్నాభిన్నమవుతుందో అనేందుకు ఉదాహారణే ఈ ఘటన. తండ్రి కుటుంబానికి ప్రధాన ఆధారం అదే గాడి తప్పితే..దాన్ని బేసి చేసికుని ఉన్నవన్ని తునాతునకలేపోతాయి. తండ్రి స్థానం ఎంత బాధ్యతయుతమైనదో..అది దారితప్పితే ఫలితం తట్టుకోవడం అనితరసాధ్యమైనది. ఎంత ప్రయత్నించిన సరిద్దుకోలేని విధంగా ఉంటుంది. 'నాన్న' అని పిలుపుకి దూరమయ్యేలా వ్యధ మిగులుతుంది.
ఈ విషాదకర ఘటన ఘజియాబాద్‌లోని గోవింద్‌పురంలో చోటుచేసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అవినాష్ అతడి సోదరి అంజలి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు 22 పేజీల సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోట్ కుటుంబ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేని తండ్రి కారణంగా ఆ పిల్లల పడ్డ బాధ కళ్లకు కట్టినట్లు కనిపించింది. అంతేగాదు తమ మరణానికి కన్న తండ్రి, సవతి తల్లి రీతులే కారణమని పేర్కొంది సూసైడ్ నోట్‌లో.
ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్లు గత గురువారం చనిపోగా, వారి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులకు చెప్పారు కుటుంబసభ్యులు. అయితే అనుమానస్పద కేసుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాధితుల ఇంటిని క్షుణ్ణంగా దర్యాప్తు చేయగా, డైరీలో రాసిన 26 పేజిల అంజలి సూసైడ్‌నటి బయటపడింది. అందులో అంజలి తన వ్యథను వివరించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తన సవతి తల్లి రీతు, తండ్రి సుఖ్వీర్ సింగ్ తమను ఎంతగానో మానసింగా వేధిస్తున్నట్లు తెలిపింది. తన తండ్రి రెండో వివాహం కోసం కన్న పిల్లల గొంతు నొక్కేశాడని, వారిని తన అవసరాలకు వాడుకున్నాడని ఆరోపించింది.
అలాగే సవతి తెలివితేలు ముందు సుఖ్వీర్ సింగ్ వివరణ పూర్తిగా నిజాయితీ లేనిదని ఆరోగపించింది. ఆయన తన సవతితల్లినే నమ్ముతాడని కూడా ఫిర్యాదు చేసింది. తన సవతి తల్లి రీతూ తన గురించి తప్పుగా మాట్లాడి అవమానించినట్లు పేర్కొంది. ఆ మాటలను తన తండ్రి ఖండించను లేదు, పైగా తననే తప్పు పట్టడం తట్టుకోలేకపోయానని వాపోయింది.
తన సవతి తల్లి నీడలో 16 ఏళ్లు తాను తన సోదరుడు ఎంత నరకయాతన అనుభవించామో చెప్పుకొచ్చింది. తన డైరీలో రాసిన సూసైడ్ నోట్‌ని చింపివేయొద్దని తను ఒంటరిగా చనిపోతే పలు ప్రశ్నలు లెవనెత్తాతారని వేడుకుంది. తన సవతి తల్లి తెలివితేటలు గురించి తెలుసునని అందుకే ముందు జాగ్రత్తగా దీన్ని ఫోటో తీసి వాట్సాప్‌లో చాలామందికి పంపినట్లు తెలిపింది. ఇక తమ మృతదేహాలను తన తండ్రి తాకడానికి వీలు లేదని తన స్నేహితుడు మహీనే తమ అంత్యక్రియలు చేయాలని కూడా చెప్పింది.
పైగా తన ఖాతాలో డబ్బు కూడా తీసుకోమని, మిగిలిన డబ్బుని తన కుటుంబసభ్యులకు ఇవ్వమని పేర్కొంది. తన స్నేహితుడు మహీనే తనను అర్థం చేసుకున్నాడని, అందకుగాను తాను ఇస్తున్న చిన్న మొత్తం ఇది అని లేఖలో తెలిపింది. అలాగే ఆ లేఖలో తన మేనమామలు, దేవేంద్ర, అనిల్‌లను ఉద్దేశిస్తూ.. ఇప్పటి వరకు మా బాగోగులు గురించి కనీసం వాకబు కూడా చేయలేదు, మీరు బంధువులేనా అని ప్రశ్నించింది. తన అన్నయ్య, తాను చాలా మానసిక ఒత్తడిలో ఉన్నాం..ఇక భరించలేక ఈ పనికి ఒడిగట్టాం అని లేఖలో పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఆ మృతుల తల్లి కమలేష్ కూడా ఇలానే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, ఆమె చనిపోయిన ఆరు నెలలకే తన స్నేహితురాలిని పెళ్లిచేసుకున్నాడంటూ బావమరిది సుఖ్వీర్‌సింగ్‌పై ఫిర్యాదు చేశారు అంజలి మేనమామలు. ఇక బాధితురాలి తండ్రి సుఖ్వీర్ సింగ్, తన భార్య తాను ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నామని, అదంతా ఎవరికోసం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
తన పిల్లల మరణంతో చచ్చిన శవంగా అయిపోయానంటూ విలపించాడు. తన కూతురు అంజలి ఇలా తన పరువు తీసేలా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందో తనకు తెలియదని చెబుతున్నాడు బాధితురాలి తండ్రి సుఖ్వీర్ సింగ్. ఇక మృతులు అవినాష్ ఇన్విస్టిగేషన్ బ్యూరో అధికారి కాగా, అంజలి నోయిడాలోని ఎగుమతి సంస్థలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నట్లు మేనమామ దేవేంద్ర వెల్లడించారు. కాగా, పోలీసులు ఈ ఘటనపై మరింత కూలంకషంగా దర్యాప్తు చేయడమేగాక దోషులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
(చదవండి: భారత్ వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి రీజన్..! రష్యన్ మహిళ పోస్ట్ వైరల్)