జయలలితకు వెన్నిరాడై నిర్మల ప్రచారం | Former Tamil actor nirmala to campaign for AIADMK | Sakshi
Sakshi News home page

జయలలితకు వెన్నిరాడై నిర్మల ప్రచారం

Mar 8 2014 11:57 AM | Updated on Sep 2 2017 4:29 AM

జయలలితకు వెన్నిరాడై నిర్మల ప్రచారం

జయలలితకు వెన్నిరాడై నిర్మల ప్రచారం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో కలిసి ఒకేసారి తమిళ సినిమాల్లో ప్రవేశించిన వెన్నిరాడై నిర్మల.. ఇప్పుడు అన్నా డీఎంకే తరఫున ప్రచారం చేయబోతున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో కలిసి ఒకేసారి తమిళ సినిమాల్లో ప్రవేశించిన వెన్నిరాడై నిర్మల.. ఇప్పుడు అన్నా డీఎంకే తరఫున ప్రచారం చేయబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున స్టార్ ప్రచారకర్తల్లో ఆమె కూడా ఒకరు కాబోతున్నారు. మొత్తం 19 మందితో కూడిన స్టార్ ప్రచారకుల జాబితాను అన్నాడీఎంకే విడుదల చేసింది. అందులో పలువురు సినిమా, టీవీ నటులు, దర్శకులు ఉన్నారు. దర్శకుడు, నటుడు రామరాజన్, వింధ్య, కమెడియన్లు సెంథిల్, గుండు కళ్యాణం, సింగముత్తు, కుయిలీ, టీవీ న్యూస్ రీడర్, నటి ఫాతిమా బాబు, విలన్లు ఆనందరాజ్, పొన్నాంబళం తదితరులున్నారు.

ఇంకా ఈ జాబితాలో అన్నా డీఎంకే ప్రచార కార్యదర్శి నంజిల్ సంపత్, శశికళా పుష్ప, పరితి ఇళంవళుతి, విజిలా సత్యానంద్ కూడా ఉన్నారు. 1986లో, వెన్నిరాడై నిర్మలను తమిళనాడు శాసనమండలికి పంపాలని అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ భావించారు. కానీ అంతకుముందు ఓ కోర్టు ఆమె దివాలా తీసినట్లు ప్రకటించడంతో సాంకేతికంగా అది సాధ్యం కాలేదు. ఆమె ఈనెల 11వ తేదీ నుంచి ప్రచారం చేస్తారని అన్నాడీఎంకే తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement