ప్రధాని మోదీతో మాజీ ప్రధాని భేటీ | former prime minister devegowda meets narendra modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో మాజీ ప్రధాని భేటీ

Jun 3 2015 8:05 PM | Updated on Aug 15 2018 2:20 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఆహ్వానించినప్పుడే దేవెగౌడను కూడా ప్రధాని నరేంద్ర మోదీ తన అధికార నివాసానికి ఆహ్వానించారు. అయితే అప్పట్లో బెంగళూరులో వేరే కార్యక్రమాల్లో ఉన్నందువల్ల దేవెగౌడ ఢిల్లీ రాలేకపోతున్నట్లు చెప్పారు.

తర్వాత ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రావాలని దేవెగౌడకు సమాచారం అందించారు. దాంతో ఇప్పుడు.. బుధవారం నాడు ఆయన ఢిల్లీ వచ్చి, నెం.7 రేస్కోర్సు రోడ్డులోని ప్రధాని అధికారిక నివాసానికి వచ్చి మోదీని కలిసి ఆయనతో కొద్దిసేపు సమావేశమయ్యారు. తెల్లటి లాల్చీ, తెల్లటి పంచె, తెల్లటి పైపంచ ధరించి వచ్చిన దేవెగౌడకు.. ప్రధాని నరేంద్రమోదీ కూడా తెల్లటి లాల్చీ పైజమా ధరించి స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement