చంద్రబాబును కలిసిన మోహన్బాబు | former MP Mohan babu met CM Chandrababu alog with Manchu Laxmi | Sakshi
Sakshi News home page

చంద్రబాబును కలిసిన మోహన్బాబు

Sep 10 2016 10:38 PM | Updated on Oct 3 2018 7:42 PM

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు తన కుమార్తె లక్ష్మితో కలిసి శనివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

హైదరాబాద్: విలక్షణ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మంచు మోహన్ బాబు శనివారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. లేక్ వ్యూ క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసిన మోహన్ బాబు వెంట ఆయన కుమార్తె మంచు లక్ష్మి కూడా ఉన్నారు.

ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయే అని, ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని మోహన్ బాబు అన్నారు. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్ బాబు చాలా ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement