రూ. 40 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత | Foreign currency worth Rs 40 lakh seized in Bihar | Sakshi
Sakshi News home page

రూ. 40 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత

Apr 24 2014 1:47 PM | Updated on Aug 14 2018 5:54 PM

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు నేపథ్యంలో బీహార్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు నేపథ్యంలో బీహార్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా వైశాలీ జిల్లా అంజన్ పీర్ చౌక్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ. 40 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ గురువారం వెల్లడించారు. పట్టుబడిన నగదును సీజ్ చేసి... అందుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.

 

స్వాధీనం చేసుకున్న నగదులో యూఎస్, దుబాయి తదితర దేశాలకు చెందిన డాలర్లు, రియాల్.... ఉన్నాయని తెలిపారు. నగదుపై ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement