ఇల్లు అద్దెకు కావాలని పిలిచి దోపిడీ... నిందితుల అరెస్ట్ | Five held, to theft gold metals seeking of house rent | Sakshi
Sakshi News home page

ఇల్లు అద్దెకు కావాలని పిలిచి దోపిడీ... నిందితుల అరెస్ట్

Aug 12 2015 6:27 PM | Updated on Mar 28 2018 11:08 AM

ఓ వ్యాపారిని బెదిరించి దోపిడికి పాల్పడిన ఐదుగురిని పేట్ బషీరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి): ఓ వ్యాపారిని బెదిరించి దోపిడికి పాల్పడిన ఐదుగురిని పేట్ బషీరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుచిత్ర సమీపంలోని గోదావరి హోమ్స్‌లో నివాసముండే రమేష్ బాబుకు స్థానికంగా జేకే నగర్‌లో మరో ఇల్లు ఇంది. ఇందులో పై పోర్షన్‌ను శర్మ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. కింది పోర్షన్ గోదాం కోసం కావాలని జూలై 16న రమేష్‌బాబును పిలిపించాడు.

ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు వ్యాపారి రమేష్‌పై దాడి చేసి 3.5 తులాల బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు తీసుకున్నారు. దాని ద్వారా రూ.50 వేలు డ్రా చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం సుచిత్ర చౌరస్తా సమీపంలో గుంటూరు జిల్లాకు చెందిన పొట్టసిరి అంకారావు అలియాస్ శర్మ (36), జలగం నాగేంద్రబాబు (24), అద్దంకి రమేష్ (30), వజ్రోజి చంద్రమౌళి (52), పొట్టసిరి చిన్న శంకర్‌రావు (49)ను క్రైం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తామే దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించారు. వీరి నుంచి ఆభరణాలు, నగదును రికవరీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement