ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం, ఇద్దరి మృతి | Fire accident catches in Pharma city | Sakshi
Sakshi News home page

ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం, ఇద్దరి మృతి

Sep 28 2015 2:11 PM | Updated on Sep 5 2018 9:45 PM

ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం, ఇద్దరి మృతి - Sakshi

ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం, ఇద్దరి మృతి

పరవాడలోని ఫార్మాసిటీలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

విశాఖపట్నం (పరవాడ) : పరవాడలోని ఫార్మాసిటీలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలోని సాయినాథ్ లైఫ్ సెన్సైస్‌లో రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో విశాఖపట్నం జిల్లా కసింకోటకు చెందిన శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన హేమంత్ అనే ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారికి దగ్గర్లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement