ఫేస్బుక్ ఛాలెంజ్పై విమర్శల వెల్లువ | Facebook 'fire challenge' faces criticism | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ ఛాలెంజ్పై విమర్శల వెల్లువ

May 18 2015 3:02 PM | Updated on Sep 5 2018 9:45 PM

ఫేస్బుక్ ఛాలెంజ్పై విమర్శల వెల్లువ - Sakshi

ఫేస్బుక్ ఛాలెంజ్పై విమర్శల వెల్లువ

గతంలో ఫేస్బుక్ వేదికగా ఏఎల్ఎస్ వ్యాధి నివారణ కోసం ప్రారంభించిన ఐస్ బకెట్ ఛాలెంజ్ విస్తృతంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు కొత్తగా వచ్చిన 'ఫైర్ ఛాలెంజ్' మాత్రం విపరీతంగా విమర్శల పాలవుతోంది.

గతంలో ఫేస్బుక్ వేదికగా ఏఎల్ఎస్ వ్యాధి నివారణ కోసం ప్రారంభించిన ఐస్ బకెట్ ఛాలెంజ్ విస్తృతంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు కొత్తగా వచ్చిన 'ఫైర్ ఛాలెంజ్' మాత్రం విపరీతంగా విమర్శల పాలవుతోంది. ఇది తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. ఇందులో పిల్లలు ఒంటిమీద కిరోసిన్ లాంటి ద్రవాన్ని పోసుకుని, నిప్పంటించుకుంటున్నారు. ఆ తర్వాత మంటలు వ్యాపించేలోగా వాళ్లు స్విమ్మింగ్ పూల్లోకి దూకాలి. అయితే, ఈ ఛాలెంజిలో పాల్గొంటున్న యువకుల్లో కొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. దాంతో ఇలా నిప్పంటించుకుని గాయపడిన ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు ఇలాంటి వీడియోలను ఆన్లైన్లో పెట్టొద్దంటూ వేడుకుంటున్నారు.

ఫైర్ఛాలెంజ్లో పాల్గొన్న టైలర్ ఓ కానర్ (9), అతడి అన్న షౌన్ (11) తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. వాళ్లు నిప్పంటించుకున్న వీడియో ఇంటర్నెట్లో విస్తృతంగా వ్యాపించింది. ఇది ఫేస్బుక్, యూట్యూబ్లలో కూడా షేర్ అయ్యింది. ఇలాంటి ఇబ్బందుల్లోకి తోటి పిల్లలను నెట్టొద్దని వాళ్ల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పుడు ఏ ఫోన్ వచ్చినా భయం వేస్తోందని, పిల్లలు ఆస్పత్రిలో ఉన్నారనో.. మరణించారనో కబురు వస్తుందన్న భయంతో ఉన్నామని అంటున్నారు. లండన్ అగ్నిమాపక శాఖ అధికారులు కూడా నిప్పుతో ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్లు చేయొద్దనే చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement