కేసీఆర్ మాట తప్పారు | errabelli dayakar rao takes on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మాట తప్పారు

Sep 16 2015 12:38 PM | Updated on Sep 3 2017 9:31 AM

కేసీఆర్ మాట తప్పారు

కేసీఆర్ మాట తప్పారు

వరంగల్ జిల్లాలో మేడారం అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్ బూటకమని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు.

హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో మేడారం అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్ బూటకమని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ... ఎన్కౌంటర్లో మరణించిన శృతి, సాగర్రెడ్డిని పోలీసులే తీసుకెళ్లి చంపారని విమర్శించారు. వారిద్దరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారని ఆయన గుర్తు చేశారు. ఈ ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. నక్సల్స్ అజెండానే తమ అజెండా అని గతంలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాట తప్పారని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం తొలి ఎన్ కౌంటర్ మంగళవారం వరంగల్ జిల్లా మేడారం మండలం తాడ్వాయి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వారిద్దరికి బుధవారం వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ ఎన్కౌంటర్పై టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావుపైవిధంగా స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement