ఎకానమీ రికవరీ మొదలైంది | Economic recovery 'fragile and incomplete', says Kenny | Sakshi
Sakshi News home page

ఎకానమీ రికవరీ మొదలైంది

Jan 14 2015 1:07 AM | Updated on Sep 2 2017 7:39 PM

ఎకానమీ రికవరీ మొదలైంది

ఎకానమీ రికవరీ మొదలైంది

అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుదల తోడ్పాటుతో కరెంటు అకౌంటు లోటును ప్రభుత్వం

 న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుదల తోడ్పాటుతో కరెంటు అకౌంటు లోటును ప్రభుత్వం ఒక మోస్తరు స్థాయికి తేగలిగిందని, దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ వృద్ధి బాట పట్టడం మొదలైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బడ్జెట్ ముం దస్తు సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆర్థికవేత్తలతో భేటీ అయిన సందర్భంగా జైట్లీ ఈ విషయాలు చెప్పారు.  ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌కి చెందిన రోహిణి సోమనాథన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్‌కి చెందిన సవ్యసాచి కర్, అహ్మదాబాద్ ఐఐఎంకి చెం దిన ఎరోల్ డిసౌజా తదితర ఆర్థికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు కూడా చేశారు. వ్యవసాయంలోనూ, ఇన్‌ఫ్రాలోనూ పెట్టుబడులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement