'కేజ్రీవాల్... ఎల్లుండిలోగా వివరణ ఇవ్వండి' | EC issues notice to Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

'కేజ్రీవాల్... ఎల్లుండిలోగా వివరణ ఇవ్వండి'

Jan 20 2015 4:08 PM | Updated on Sep 2 2017 7:59 PM

'కేజ్రీవాల్... ఎల్లుండిలోగా వివరణ ఇవ్వండి'

'కేజ్రీవాల్... ఎల్లుండిలోగా వివరణ ఇవ్వండి'

అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం మంగళవారం నోటీసు జారీ చేసింది.

న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి డబ్బులు తీసుకుని, ఓటు మాత్రం ఆప్‌కే వేయాలంటూ ఢిల్లీ ఓటర్లకు సలహా ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం మంగళవారం నోటీసు జారీ చేసింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనకు నోటీసు పంపింది. ఎల్లుండి(గురువారం)లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement