గుంటూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు | earthquake in guntur district | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

Jul 27 2015 1:50 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది.

గుంటూరు క్రైమ్: గుంటూరు జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లాలోని శావల్యాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం స్వల్పంగా భూమి కంపించింది. శావల్యాపురం మండల కేంద్రంతోపాటు మండలంలోని సేలంపూడి, గొంగిలిపాలెం, మత్కుమల్లి గ్రామాల్లో భూప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ఎక్కడా ఆస్తి నష్టం నమోదు కాలేదు.

నవ్యాంధ్ర రాజధాని భూకంప తీవ్రత కలిగిన జోన్ పరిధిలోనే ఉందని ఐఐఐటీ హైదరాబాద్ ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ విభాగాధిపతి ఫ్రొఫెసర్ రామచర్ల ప్రదీప్‌కుమార్ చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement