గ్యాస్ట్రిక్ సమ స్యల చికిత్సలో ఉపయోగించే రానిటిడిన్ హైడ్రోక్లోరైడ్ (150 మి.గ్రా.) ఔషధ లాట్లు అయిదింటిని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్‌ఎల్) అమెరికా మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. ఇవి
అమెరికా నుంచి డాక్టర్ రెడ్డీస్ ‘రానిటిడిన్’ ఔషధం రీకాల్
Aug 23 2013 2:39 AM | Updated on Aug 24 2018 7:24 PM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్యాస్ట్రిక్ సమ స్యల చికిత్సలో ఉపయోగించే రానిటిడిన్ హైడ్రోక్లోరైడ్ (150 మి.గ్రా.) ఔషధ లాట్లు అయిదింటిని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్‌ఎల్) అమెరికా మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. ఇవి సూక్ష్మజీవుల వల్ల కలుషితం కావడం ఇందుకు కారణం. తమ సొంత బ్రాండ్ కింద విక్రయించుకునేలా మూడు వేర్వేరు సంస్థలకు డాక్టర్ రెడ్డీస్ వీటిని ఎగుమతి చేసింది. కంపెనీ వీటిని స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తెలిపింది.
Advertisement


