Breaking: మళ్లీ ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు | US Launches Fresh Airstrikes on Iran Hours After Trump Warning Chabahar Bandar Abbas Targeted | Sakshi
Sakshi News home page

Breaking: మళ్లీ ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు

Jul 9 2026 2:33 AM | Updated on Jul 9 2026 2:55 AM

US Launches Fresh Airstrikes on Iran Hours After Trump Warning Chabahar Bandar Abbas Targeted

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త దాడులపై హెచ్చరించిన కొన్ని గంటల్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌పై తాజా వైమానిక దాడులను ప్రారంభించినట్లు ప్రకటించింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా తెలిపింది.

ఇరాన్ దక్షిణ తీరంలోని వ్యూహాత్మక నౌకాశ్రయ నగరాలైన చాబహార్, బందర్ అబ్బాస్ పరిసర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వినియోగించే సైనిక మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యాలుగా అమెరికా దాడులు సాగించినట్లు సమాచారం.

"హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపర్చడమే ఈ దాడుల ఉద్దేశం" అని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇటీవల వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికా ఆరోపించింది.

కాగా ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటిస్తూ, అవసరమైతే ఇరాన్‌పై మరింత కఠిన చర్యలకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ హెచ్చరించారు. ఆయన ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా దాడులు చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement