ఈ శునకం నిజంగా హీరో!

ఈ శునకం నిజంగా హీరో! - Sakshi


న్యూయార్క్‌: ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడేందుకు కాస్త వెనకాముందు ఆలోచిస్తాం. మనకేదైనా నష్టం కలుగుతుందేమోనని భయపడతాం. కానీ జంతువులకు ఇలాంటి ఆలోచనలు, భయాలు ఉండవు కదా..? అందులో శునకంలాంటి విశ్వాసంగల జీవికి అసలే ఉండవనే విషయం మరోసారి రుజువైంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న శునకం ఆపదలో ఉన్న మరో మూగజీవిని కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.న్యూయార్క్‌కి చెందిన మార్క్‌ ఫ్రీలీ అనే వ్యక్తి తన పెంపుడు శునకంతో కలిసి బీచ్‌లో నడుస్తున్నాడు. ఉన్నట్టుండి ఆ పెంపుడు శునకం ఒక్కసారిగా నీటిలోకి దూకింది. ఎందుకలా దూకిందో ఫ్రీలీకి కాసేపు అర్థం కాలేదు. అయితే నీటిలో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న ఓ జింకను కాపాడేందుకు ఆ శునకం నీటిలో దూకిందని గ్రహించాడు. వెంటనే ఆ శునకం జింక పిల్లలను కాపాడే ఘటనను వీడియో తీశాడు. జింక పిల్ల మెడ భాగాన్ని ఆ శునకం నోటితో పట్టుకుని నెమ్మదిగా ఒడ్డుకు తీసుకొచ్చింది. అంతేకాదు.. జింక పిల్లకు కొన్ని సపర్యలు కూడా చేసింది. ఈలోపు ఫ్రీలీ జంతు సంరక్షణ విభాగానికి సమాచారమిచ్చి జింకను ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ జింక పిల్ల కోలుకుంటోంది.  

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top