దుర్గమ్మ గుడిలో తేజ ప్రత్యేక పూజలు | Director Teja visits Vijayawada kanaka durga temple | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ గుడిలో తేజ ప్రత్యేక పూజలు

Sep 11 2015 11:14 AM | Updated on Aug 28 2018 4:30 PM

దుర్గమ్మ గుడిలో తేజ ప్రత్యేక పూజలు - Sakshi

దుర్గమ్మ గుడిలో తేజ ప్రత్యేక పూజలు

తాను తీసే సినిమాలలో సామాన్యుడే హీరో అని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ తెలిపారు.

విజయవాడ : తాను తీసే సినిమాలలో సామాన్యుడే హీరో అని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ తెలిపారు. తన సినిమాల్లోకి  జనాల్లో నుంచే హీరోని తీసుకుంటానన్నారు. అంతకుముందు శుక్రవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలోని కనక దుర్గమ్మని ఆయన దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆ తర్వాత ఆయనకు ఆలయ పూజార్లు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తేజ దర్శకత్వంలో వచ్చిన పలు టాలీవుడ్ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆయన దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు మధ్య డాష్ డాష్ చిత్రం ప్లాప్ అయిన విషయం విదితమే. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత హోరాహోరీ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం నేడు విడుదల అయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement