అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ | Delhi Court orders Arvind Kejriwal to be taken into custody | Sakshi
Sakshi News home page

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్

May 21 2014 5:35 PM | Updated on Sep 2 2017 7:39 AM

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్

నితిన్ గడ్కరీ పరువునష్టం దావా కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.

న్యూఢిల్లీ: నితిన్ గడ్కరీ పరువునష్టం దావా కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. బెయిల్ బాండ్ సమర్పించేందుకు కేజ్రీవాల్ నిరాకరించడంతో ఆయనను అదుపులోకి తీసుకోవాలని పాటియాలా న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశంతో కేజ్రీవాల్ ను గట్టి భద్రత నడుమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23 వరకు ఆయన జైల్లోనే ఉంటారు. ఆయ నను తీహార్ జైలుకు తరలించారు. శుక్రవారం ఆయనను కోర్టు ముందు హాజరుపరుస్తారు.

రూ.10 వేలకు బయిల్ బాండ్ సమర్పిస్తే బెయిల్ మంజూరు చేస్తామని కోర్టు చెప్పినా కేజ్రీవాల్ వినిపించుకోలేదు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అవినీతిపరుడంటూ కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్పై గడ్కరీ పరువునష్టం దావా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement