తెలంగాణలో రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ
తెలంగాణలో రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ
నల్లగొండ: చింతన్‌శిబిర్ తొలి రోజు సమావేశాల అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు, జాతీయ రహదారుల అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల మంజూరుపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.
పలు కీలక ప్రాజెక్టులపై విజ్ఞప్తి
ఎల్‌బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, ఎన్‌హెచ్–65ను 6+2 లేన్లుగా విస్తరించడం, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర, దక్షిణ భాగాలు, హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, ఎన్‌హెచ్–765పై ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటుపై మంత్రి గడ్కరీ దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లారు. పర్వతమాల పథకం కింద ఐదు రోప్‌వేలు, సీఆర్‌ఐఎఫ్ కింద 33 రహదారి పనులు, మూడు కీలక ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలు మంజూరు చేయాలని కోరారు.
తెలంగాణలో రహదారి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమి స్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, పట్టణ అభివృద్ధికి మెరుగైన రహదారి అనుసంధానం అత్యంత కీలకమన్నారు. తాన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి తెలిపారు.


