TG: పలు కీలక ప్రాజెక్టులకు ఆ‍మెదం తెలిపిన నితిన్ గడ్కరీ | Komatireddy Venkat Reddy met Union Minister Nitin Gadkari | Sakshi
Sakshi News home page

TG: పలు కీలక ప్రాజెక్టులకు ఆ‍మెదం తెలిపిన నితిన్ గడ్కరీ

Oct 13 2026 9:30 PM | Updated on Oct 13 2026 9:31 PM

Komatireddy Venkat Reddy met Union Minister Nitin Gadkari

సాక్షి, న్యూఢిల్లీ:  రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు మంగళవారం  ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో ప్రత్యేక భేటీ నిర్వహించారు. తెలంగాణలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు.  దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి రాష్ట్ర ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ కు ,కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. దానితో పాటు రాష్ట్రానికి 5 రోప్ వే లు, సేతు బంధన్ పథకం ద్వారా 3 ఆర్ఓబి లకుకు కేంద్రమంత్రి ఆమోదం తెలిపారు.

ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం వల్ల NH 167k పై తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్  అనుసంధానం జరిగి, రవాణా వ్యవస్థ,పర్యాటకం మెరుగుపడతుందని, హైదరాబాద్ - శ్రీశైలం NH 765పై ఎలివేటెడ్ కారిడార్ కి విజ్ఞప్తి పై నూతన డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను నితిన్ గడ్కరీ ఆదేశించారు. హైద్రాబాద్ - అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే పై సానుకూలంగా స్పందించారు.

పుల్లూరు  - అలంపూర్ - జట్రపోలు - పెంట్లవెల్లి - కొల్లాపూర్ - లింగాల - అచ్చంపేట - డిండి - దేవరకొండ - మల్లేపల్లి - నల్గొండ రాష్ట్ర హైవే లను జాతీయ హై వే లుగా మార్చాలని కోరడంతో సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి హైదరాబాద్ లో నవంబర్ 19-22 వరకు జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్(IRC) కు మంత్రి ఆహ్వానించగా దీనిపై సానుకూలంగా స్పందించి కార్యాక్రమానికి హాజరవుతాన్నారు.


ఇదీ చదవండి: బ్లాక్‌ టికెట్ల ముఠా అరెస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement