నేరస్థుడి పరారీ.. పోలీసుల సస్పెన్షన్ | Criminal escapes from custody, two cops suspended | Sakshi
Sakshi News home page

నేరస్థుడి పరారీ.. పోలీసుల సస్పెన్షన్

May 24 2014 12:13 PM | Updated on Aug 16 2018 4:36 PM

కోర్టుకు తీసుకెళ్తుండగా ఓ నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో అతడికి కాపలాగా ఉన్న ఇద్దరు పోలీసులు సస్పెండయ్యారు.

కోర్టుకు తీసుకెళ్తుండగా ఓ నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో అతడికి కాపలాగా ఉన్న ఇద్దరు పోలీసులు సస్పెండయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ ప్రాంతంలో జరిగింది. జబ్బార్ అనే నిందితుడిని బస్సులో కోర్టుకు తీసుకెళ్తున్నారు. అతడి చేతులను తాడుతో కట్టేశారు.

అయితే, జబ్బార్ ఆ తాడును కత్తిరించి, పోలీసుల కన్నుగప్పి బస్సులోంచి ఉడాయించాడు. తితావీ ప్రాంతంలో జరిగిన చోరీ కేసులో అతడిని శుక్రవారం నాడు అరెస్టు చేశారు. అయితే, నాటకీయంగా జబ్బార్ తప్పించుకోవడంతో.. అతడికి కాపలాగా వెళ్లిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement