250 మందిని... రూ. 33 కోట్లకు ముంచేశారు | Couple held for cheating 250 persons | Sakshi
Sakshi News home page

250 మందిని... రూ. 33 కోట్లకు ముంచేశారు

Jul 7 2015 5:18 PM | Updated on Jul 10 2019 7:55 PM

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 250 మందిని రూ. 33 కోట్ల మేర ముంచేసిన జంటను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 250 మందిని రూ. 33 కోట్ల మేర ముంచేసిన జంటను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. సంజీవరావు, బృంద అనే ఇద్దరు దంపతులు ఈరోడ్ ప్రాంతంలో 2012 సంవత్సరంలో షేర్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభించారు.

దాదాపు 250 మందికి పైగా వీళ్ల సంస్థలో దాదాపు రూ. 33 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే, తర్వాత వాళ్లు ఓ మంచి రోజు చూసుకుని అక్కడి నుంచి జెండా ఎత్తేశారు. దాంతో తమ సొమ్ము ఏమైపోయిందోనని పెట్టుబడులు పెట్టినవాళ్లంతా గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఆ జంటను పోలీసులు అరెస్టు చేయడంతో ఏమైనా వెనక్కి వస్తాయేమోనని ఎదురు చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement