ఎంత అధ్యక్షుడైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా.. కానీ కొలంబియా అధ్యక్షుడు మాత్రం అలా జాగ్రత్త పడలేదు. అందుకే సైకిల్ మీద నుంచి పడిపోయారు.
ఎంత అధ్యక్షుడైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా.. కానీ కొలంబియా అధ్యక్షుడు మాత్రం అలా జాగ్రత్త పడలేదు. అందుకే సైకిల్ మీద నుంచి పడిపోయారు. విషయం ఏమిటంటే, అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్కు ఆ దేశంలోని అంతర్గత యుద్ధ బాధితులు కొంతమంది కలిసి ఓ సైకిల్ బహూకరించారు. వాళ్లేదో సరదాగా ఇస్తే దాన్ని ఓ పక్కన పెట్టాలి గానీ, ఇచ్చారు కదాని తొక్కేస్తానంటే ఎలా? అలాగే తొక్కబోయి.. కొంతదూరం వెళ్లాడో లేదో.. దబ్బున కింద పడ్డారు. పక్కనే సెక్యూరిటీ గార్డులు, అందరూ ఉండటంతో పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు గానీ, అధ్యక్షుడు పడిపోయాడన్న వార్త మాత్రం ఇట్టే వ్యాపించింది.
అయితే, అందరు రాజకీయ నాయకుల్లాగే ఆయన కూడా ఈ సంఘటనను బాగానే ఉపయోగించుకున్నారు. ''జీవితంలో ఎప్పుడైనా పడిపోతే మళ్లీ లేచి ముందుకెళ్లాలి తప్ప పడిపోయామని బాధపడకూడదు. మన దేశంలో అంతర్యుద్ధ బాధితులంతా ఈ విషయాన్ని తెలుసుకోవాలి'' అని ఉద్బోధించారు.