చౌక ధర స్మార్ట్‌ఫోన్ల హవా | Cheap price of smartphones are the hot cakes | Sakshi
Sakshi News home page

చౌక ధర స్మార్ట్‌ఫోన్ల హవా

Dec 3 2013 2:34 AM | Updated on Sep 2 2017 1:11 AM

చౌక ధర  స్మార్ట్‌ఫోన్ల హవా

చౌక ధర స్మార్ట్‌ఫోన్ల హవా

భారత్‌లో ఫీచర్ ఫోన్ల అమ్మకాలను చౌక ధర స్మార్ట్‌ఫోన్లు ఆక్రమిస్తున్నాయి.

న్యూఢిల్లీ: భారత్‌లో ఫీచర్ ఫోన్ల అమ్మకాలను చౌక ధర స్మార్ట్‌ఫోన్లు ఆక్రమిస్తున్నాయి. మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్, కార్బన్ తదితర దేశీయ కంపెనీలు తక్కువ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందించడం వల్ల ఫీచర్ ఫోన్ల అమ్మకాలను స్మార్ట్‌ఫోన్‌లు అధిగమిస్తున్నాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, ఐడీసీ పేర్కొంది.

 మరిన్ని వివరాలు...
గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో 38 లక్షలుగా ఉన్న స్మార్ట్ ఫోన్ విక్రయాలు ఈ ఏడాది జూలైత-సెప్టెంబర్ కాలానికి 229 % వృద్ధితో 1.28 కోట్లకు చేరాయి. ఏప్రిల్-జూన్ క్వార్టర్ అమ్మకాల(1 కోటి) తో పోల్చితే 28% వృద్ధి చెందాయి.

గత క్యూ3లో 5.57 కోట్లుగా ఫీచర్ ఫోన్ల విక్రయాలు ఈ క్యూ3లో 5.39 కోట్లకు తగ్గాయి. మొత్తం మొబైల్ ఫోన్ విక్రయాల్లో ఫీచర్ ఫోన్ల వాటా 84 శాతం నుంచి 81 శాతానికి తగ్గింది.

ఫీచర్ ఫోన్లకు, ఎంట్రీ లెవల స్మార్ట్‌ఫోన్లకు మధ్య ధర వ్యత్యాసం తగ్గుతుండడంతో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లకే  మొగ్గు చూపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement