micro max
-
బడ్జెట్లో మైక్రోమాక్స్ నోట్ 1 మోడల్
micromax in note1 డిస్ప్లే: 6.67 అంగుళాలు రెజల్యూషన్: 1080్ఠ2400 పిక్సెల్స్ ర్యామ్: 4జీబి స్టోరేజ్: 128 జీబి బ్యాటరీ: 5,000 ఎంఎహెచ్ కలర్ ఆప్షన్స్: గ్రీన్, వైట్ ∙ఎల్‌యిడి ఫ్లాష్ ∙నైట్‌విజన్ సపోర్ట్ ∙48–మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ∙5–మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ ధర: రూ.10,999 realme 7i డిస్ప్లే: 6.5 అంగుళాలు మెమోరీ: 64జీబి 4జీబి ర్యామ్ 128జీబి 4జీబి ర్యామ్ 128జీబి 8జీబి బ్యాటరీ: 5000 ఎంఎహెచ్ రెజల్యూషన్: 720్ఠ1600 పిక్సెల్స్ బరువు: 188గ్రా, కలర్: అరోరా గ్రీన్, పొలార్ బ్లూ ∙ఫింగర్ ప్రింట్ సెన్సర్ ∙గొరిల్లా గ్లాస్ 3 ధర: రూ.12,999 నుండి. గ్యాడ్జెట్ బజార్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3 సైజ్: 45 యంయం బాడీ: గొరిల్లా గ్లాస్ డిఎక్స్ మెమోరీ: 8జీబి 1జీబి ర్యామ్ డిస్ప్లే: 360్ఠ360 రెజల్యూషన్ కలర్ ఆప్షన్స్: మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ వైట్ ∙టైటానియం ఫ్రేమ్ ∙వాటర్ రెసిస్టెంట్ ∙ ఎల్టీయి కనెక్టివిటీ ∙శాంసంగ్ పే ∙సీజీ సర్టిఫైడ్ ∙ బ్లడ్ ప్రెజర్ మానిటర్ ∙లౌడ్ స్పీకర్ ధర: రూ.29,990 సోషల్ మీడియా ఆతరువాత....ఇక మాయమే! టెలిగ్రామ్ ‘సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెసేజెస్’ ఫీచర్ తరహాలో సరికొత్త ఫీచన్‌ను తీసుకురానుంది వాట్సాప్. వ్యక్తులు లేదా గ్రూప్‌లకు పంపిన మెసేజ్ ఏడు రోజుల తరువాత దానికదే మాయమవుతుంది. బానే ఉందిగానీ ఆ టైమ్‌లో వాట్సాప్ ఓపెన్ చేయనివారి పరిస్థితి ఏమిటి? అనే సందేహం రావచ్చు. అలాంటి వారి కోసం ‘టెంపరరీ మెసేజ్’ కనిపిస్తుంది. ఎనేబుల్, డిసేబుల్ ఆప్షన్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. మరో విషయం ఏమిటంటే, వృథాగా పడి ఉన్న మెసేజ్‌లను మరింత సులభంగా డిలిట్ చేయడానికి ‘స్టోరేజ్ మెనేజ్మెంట్’ టూల్‌ను అప్డెట్ చేస్తుంది వాట్సాప్. రిడిజైన్ చేసిన టూల్ ‘మెనేజ్ స్టోరేజ్’ సబ్ మేనూలో అందుబాటులో ఉండనుంది. ఎందుకంటే...ఇందుకంటా! ‘డిన్నర్ పార్టీ కోసం’ ‘హాస్పిటల్‌కు వెళ్లాలి’ ‘సురేష్ వచ్చాడు’....కాల్ చేయడానికి ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. పీకలలోతు పనుల్లో మునిగిపోయి ముఖ్యమైన ‘కాల్’ను ఇగ్నోర్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ‘కాల్’కు ముఖ్య కారణం సూక్ష్మంగా చెప్పేస్తే ఇరుపక్షాలకి మేలే కదా. కాల్పికప్ రేట్ కూడా పెగుతుంది. ఈ ఉద్దేశంతోనే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ట్రూ కాలర్ ‘కాల్ రీజన్’ అనే కొత్త అప్లికేషన్‌ను తీసుకువస్తుంది. ‘సోషల్ మీడియాలో నెటిజెన్స్ పాప్లర్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కాల్ రీజన్ ఫీచర్‌ను తీసుకువస్తున్నాం’ అని తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది ట్రూ కాలర్. -
మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ @ 999
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘మైక్రోమాక్స్’ తాజాగా ‘భారత్ 2 అల్ట్రా’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.2,899. అయితే వొడాఫోన్ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ ఉంది. రూ.2,899 వెచ్చించి ఫోన్‌ను కొన్న కస్టమర్లు వొడాఫోన్ సిమ్‌ను (కొత్త/పాత కనెక్షన్) వాడితే రెండు విడతల్లో రూ.1,900 రిఫండ్ పొందొచ్చు. కాకపోతే వొడాఫోన్ సిమ్‌ను మూడేళ్లపాటు ప్రతి నెలా కనీసం రూ.150లతో రీచార్జ్ చేసుకుంటేనే ఇది వర్తిస్తుంది. ఇలా చేసే యూజర్ల కు తొలి 18 నెలల తర్వాత రూ.900, తర్వాతి 18 నెలల తర్వాత మరో రూ.1,000 క్యాష్‌బ్యాక్ అంది... అది వొడాఫోన్ ‘ఎం–పైసా’ వాలెట్లో జమవుతుంది. స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,899లో రూ.1,900 క్యాష్‌బ్యాక్‌ను తీసేస్తే అప్పుడు రూ.999లకే ఫోన్ వచ్చినట్లు అవుతుంది. కాగా ‘భారత్ 2 అల్ట్రా’ స్మార్ట్‌ఫోన్‌లో 4 జీబీ మెమరీ, 512 ఎంబీ ర్యామ్, 1.3 గిగాహెర్ట్›్జ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4 అంగుళాల స్క్రీన్, 2 ఎంపీ రియర్ కెమెరా, 0.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1,300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ మార్‡్షమాలో ఓఎస్ వంటి ప్రత్యేకతలున్నాయని మైక్రోమాక్స్ తెలిపింది. -
చౌక ధర స్మార్ట్ఫోన్ల హవా
న్యూఢిల్లీ: భారత్‌లో ఫీచర్ ఫోన్ల అమ్మకాలను చౌక ధర స్మార్ట్ఫోన్లు ఆక్రమిస్తున్నాయి. మైక్రోమ్యాక్స్, సెల్కాన్, కార్బన్ తదితర దేశీయ కంపెనీలు తక్కువ ధరల్లో స్మార్ట్ఫోన్లను అందించడం వల్ల ఫీచర్ ఫోన్ల అమ్మకాలను స్మార్ట్ఫోన్లు అధిగమిస్తున్నాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, ఐడీసీ పేర్కొంది. మరిన్ని వివరాలు... గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో 38 లక్షలుగా ఉన్న స్మార్ట్ ఫోన్ విక్రయాలు ఈ ఏడాది జూలైత-సెప్టెంబర్ కాలానికి 229 % వృద్ధితో 1.28 కోట్లకు చేరాయి. ఏప్రిల్-జూన్ క్వార్టర్ అమ్మకాల(1 కోటి) తో పోల్చితే 28% వృద్ధి చెందాయి. గత క్యూ3లో 5.57 కోట్లుగా ఫీచర్ ఫోన్ల విక్రయాలు ఈ క్యూ3లో 5.39 కోట్లకు తగ్గాయి. మొత్తం మొబైల్ ఫోన్ విక్రయాల్లో ఫీచర్ ఫోన్ల వాటా 84 శాతం నుంచి 81 శాతానికి తగ్గింది. ఫీచర్ ఫోన్లకు, ఎంట్రీ లెవల స్మార్ట్ఫోన్లకు మధ్య ధర వ్యత్యాసం తగ్గుతుండడంతో వినియోగదారులు స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు.