వైద్య, ఆరోగ్యశాఖపై చంద్రబాబు సమీక్ష | Chandrababu naidu to review on Medical, health department | Sakshi
Sakshi News home page

వైద్య, ఆరోగ్యశాఖపై చంద్రబాబు సమీక్ష

Sep 8 2015 10:24 PM | Updated on Jul 28 2018 4:52 PM

వైద్య, ఆరోగ్యశాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

విజయవాడ: వైద్య, ఆరోగ్యశాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకల దాడిపై అధికారుల తీరుపట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలందిస్తున్న ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ప్రైవేట్ భాగస్వామ్యంతో వైద్యకళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ వైద్య, ఆరోగ్యశాఖ కమిషనరేట్ను విజయవాడకు తరలించాలని సూచించినట్టు తెలిసింది. ఆస్పత్రుల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement