కాంగ్రెస్కు మరో కొత్త నటుడు దొరికాడు: చంద్రబాబు | Chandra babu lashes out at Kiran kuamr Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్కు మరో కొత్త నటుడు దొరికాడు: చంద్రబాబు

Feb 3 2014 7:07 PM | Updated on Jul 29 2019 5:31 PM

కాంగ్రెస్కు మరో కొత్త నటుడు దొరికాడు: చంద్రబాబు - Sakshi

కాంగ్రెస్కు మరో కొత్త నటుడు దొరికాడు: చంద్రబాబు

కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో మరో కొత్త నటుడు దొరికాడని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో మరో కొత్త నటుడు దొరికాడని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. సోమవారం ఆయన జేడీయూ నేత శరద్ యాదవ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కిరణ్కు ధైర్యముంటే సోనియా ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు. టెన్ జన్పథ్ రాసిన  స్ర్కిప్ట్‌ ప్రకారం సీఎం నటిస్తున్నాడని ఆరోపించారు.

ఇదిలావుండగా రాష్ట్ర విభజనపై చంద్రబాబు మరోసారి అస్పష్ట వైఖరి ప్రదర్శించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వస్తే అనుకూలంగా ఓటేస్తారా లేక వ్యతిరేకంగా ఓటేస్తారా అన్న మీడియా ప్రశ్నకు చంద్రబాబు సమాధానం దాటవేశారు. శరద్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఇరు ప్రాంతాల్లో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement