మళ్లీ స్కూల్‌ రోజులు గుర్తొచ్చాయ్‌! | Celebs get nostalgic about school on Teachers Day | Sakshi
Sakshi News home page

మళ్లీ స్కూల్‌ రోజులు గుర్తొచ్చాయ్‌!

Sep 5 2016 4:19 PM | Updated on Apr 3 2019 6:34 PM

మళ్లీ స్కూల్‌ రోజులు గుర్తొచ్చాయ్‌! - Sakshi

మళ్లీ స్కూల్‌ రోజులు గుర్తొచ్చాయ్‌!

స్కూల్‌లో చదువుకునే రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతిగా మిగిలిపోతాయ్‌.

స్కూల్‌లో చదువుకునే రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతిగా మిగిలిపోతాయ్‌. తమకు విద్యాబుద్ధులు నేర్పి.. సమాజంలో ఒక స్థానం కల్పించిన గురువులంటే చాలామందికి ఎనలేని గౌరవభావం ఉంటుంది. అందుకే టీచర్స్‌ ఉపాధ్యాయులు దినోత్సవం సందర్భంగా చాలామంది తమ స్కూల్‌ రోజులను నెమరువేసుకుంటున్నారు. తమకు నచ్చిన ఉపాధ్యాయులను గుర్తుచేసుకుంటారు. వారు పంచిన జ్ఞానం, ఇచ్చిన స్ఫూర్తికి కృతజ్ఞతలు చెప్పుకొంటారు. మన సినీ సెలబ్రిటీలు కూడా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తమ బాల్యంలోని స్కూల్‌ జ్ఞపకాలను నెమరువేసుకున్నారు. ఉపాధాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

'చెంబూర్‌లోని సెయింట్‌ ఆంటోనీస్‌ గర్ల్స్‌ హై స్కూల్‌, నా కాలేజీ, యూనివర్సిటీ ఉపాధ్యాయులకు టీచర్స్‌ డే శుభాకాంక్షలు. స్కూల్‌ రోజుల్లో వేసిన స్కిట్లు, ఆడిన ఆటలు, హాఫ్‌ డే సెలవులు పంచిన ఆనందాలను నేనిప్పుడు ఎంతోగానో మిస్‌ అవుతున్నా' అని విద్యాబాలన్ ట్వీట్‌ చేయగా.. 'నా స్కూల్‌ రిపోర్ట్‌ బుక్‌ను తెరిచి చూసుకోవడానికి ఇదే సరైన రోజు. ఇప్పటికీ నా ప్రోగ్రెస్‌ రిపోర్ట్స్‌ చాలా బాగున్నాయి' అంటూ సాజిద్‌ ఖాన్‌ పేర్కొన్నారు. 'మీ జీవితం, మీ వైఫల్యాలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాలు, మీకు ఎదురైన అవమానాలు, మీరు సంబరాలు జరుపుకొన్న సందర్భాలు.. ఇవే నిజమైన టీచర్లు' అంటూ 'విక్కీ డోనర్‌' స్టార్‌ ఆయుష్మాన్‌ కురానా ట్వీట్‌ చేశారు. వీరితోపాటు పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement