నమ్మలేం! ఒకప్పటి హీరోయిన్‌.. ఆమేనా? | can you recognise this horoine | Sakshi
Sakshi News home page

నమ్మలేం! ఒకప్పటి హీరోయిన్‌.. ఆమేనా?

Published Sat, Feb 25 2017 10:27 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

'గుచ్చి గుచ్చి చంపమాకు హొయలా' అంటూ నాగార్జున సరసన 'సూపర్‌' సినిమాలో అలరించిన అయేషా టకియా గుర్తుందా?..

'గుచ్చి గుచ్చి చంపమాకు హొయలా' అంటూ నాగార్జున సరసన 'సూపర్‌' సినిమాలో అలరించిన అయేషా టకియా గుర్తుందా?.. తెలుగులో 'సూపర్‌'తోపాటు, హిందీలో పలు సినిమాలు చేసిన ఈ భామ అప్పట్లో తన అందచందాలతో అభిమానుల్ని ఉర్రూతలూంగించింది.

2009లో ఎస్పీ లీడర్‌ అబు ఆజ్మీ కొడుకు ఫర్హాన్ ఆజ్మీని పెళ్లి చేసుకున్న అయేషా గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లయిన తర్వాత అడపాదడపా సోషల్‌ మీడియాలో ఫొటోలతో అభిమానులకు దర్శనమిచ్చిన ఈ అమ్మడు.. తాజాగా గత గురువారం ఓ వేడుకకు హాజరయింది. అక్కడ ఆమెను చూసిన వారు నమ్మలేకపోయారు.  పెళ్లయి, ఓ బిడ్డకు తల్లి అయిన అయేషా ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఒకప్పుడు స్లిమ్‌గా కుందనపు బొమ్మలా సినిమాల్లో అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు కాస్తా బొద్దుగా ఏమాత్రం గుర్తుపట్టనంతగా మారిపోవడంతో ఆమె అభిమానులు, బాలీవుడ్‌ వర్గాలు విస్తుపోయారు. అన్నట్టు మళ్లీ సినిమాల్లో అడుగుపెట్టాలని అయేషా భావిస్తున్నది. త్వరలోనే మళ్లీ తెరపై కనిపిస్తానని, ప్రస్తుతం కథలు వింటున్నానని ఈ అమ్మడు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement