బీబీసీలో మోడీకిచ్చే కవరేజి ఇదేనా? | British Indian MP flays BBC over Narendra Modi coverage | Sakshi
Sakshi News home page

బీబీసీలో మోడీకిచ్చే కవరేజి ఇదేనా?

May 31 2014 3:27 PM | Updated on Aug 15 2018 2:20 PM

బీబీసీలో మోడీకిచ్చే కవరేజి ఇదేనా? - Sakshi

బీబీసీలో మోడీకిచ్చే కవరేజి ఇదేనా?

భారత ప్రధాని నరేంద్రమోడీని బీబీసీ అస్సలు పట్టించుకోలేదా? ఇదే అంశంపై బ్రిటన్లో భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్ ఘాటుగా విరుచుకుపడ్డారు.

భారత ప్రధాని నరేంద్రమోడీని బీబీసీ అస్సలు పట్టించుకోలేదా? ఆయన భారీ మెజారిటీ సాధించిన రోజున.. అంటే ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు దాదాపు ప్రపంచమంతా మోడీవైపే చూస్తున్నా, బీబీసీ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించిందా? సరిగ్గా ఇదే అంశంపై బ్రిటన్లో భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్ ఘాటుగా విరుచుకుపడ్డారు. తీవ్ర స్థాయిలో తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ బీబీసీ డైరెక్టర్ జనరల్ లార్డ్ టోనీ హాల్కు ఆమె లేఖ రాశారు.

మే 16వ తేదీన భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బీబీసీ సరిగ్గా ఇవ్వలేదని బ్రిటన్లో భారత జాతీయులు, ముఖ్యంగా గుజరాతీలు చాలామంది తనకు ఫిర్యాదు చేశారని ఆమె అన్నారు. అంతేకాదు.. ఈ ఫలితాలను టీవీలో ప్రజెంట్ చేసిన యాల్దా హకీమ్ అయితే.. మోడీని వివాదాస్పద వ్యక్తిగా అభివర్ణించారని కూడా ఆమె మండిపడ్డారు. కేవలం ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే మోడీని అలా అంటారని, ఈ మాట ఉపయోగించడం ద్వారా బీబీసీ నిష్పాక్షికతను వదిలేసి ఆయన రాజకీయ ప్రత్యర్థి పాత్రలోకి మారిపోయినట్లయిందని ప్రీతి పటేల్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement