బీజేపీ 'సెంచరీ' రికార్డు | BJP hits century in Maha, first party to do so since 1990 | Sakshi
Sakshi News home page

బీజేపీ 'సెంచరీ' రికార్డు

Oct 19 2014 6:36 PM | Updated on Mar 29 2019 6:00 PM

బీజేపీ 'సెంచరీ' రికార్డు - Sakshi

బీజేపీ 'సెంచరీ' రికార్డు

నరేంద్ర మోదీ ప్రభంజనంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది.

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభంజనంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. మహారాష్ట్రలో 24 ఏళ్ల తర్వాత 100కు పైగా అసెంబ్లీ సీట్లు సాధించిన ఏకైక పార్టీగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు కాంగ్రెస్ పేరిట ఉంది. 1990 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 144 సీట్లు సాధించింది. ఆ తర్వాత జాతీయ పార్టీలు గానీ, ప్రాంతీయ పార్టీలు గాని ఇప్పటివరకు వంద సీట్లు దక్కించుకోలేకపోయాయి.

తాజా ఎన్నికల్లో బీజేపీ 120 పైగా స్థానాలను బీజేపీ కైవశం చేసుకోనుందని ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తోంది. 2009 కంటే మూడు రెట్లు అధిక స్థానాలను బీజేపీ గెల్చుకోనుండడం విశేషం. మహారాష్ట్ర శాసనసభలో 288 సీట్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement