ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేసింది. ముజఫర్‌నగర్ సంఘటనలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, బాధితులకు సరైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. రాష్ట్రపతిని కలిసిన అనంతరం రాజ్‌నాథ్ సింగ్ విలేకరుల తో మాట్లాడుతూ, యూపీలో పాలన అనేదే లేకుండా పోయిందని ఆరోపించారు. ఆరునెలలుగా యూపీలో అరాచకాలు కొనసాగుతున్నాయని తాము గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి ముందుగానే సమాచారం ఇచ్చినా వారు ఖాతరు చేయలేదన్నారు.