షీలాతో బీజపీ మాజీ అధ్యక్షుడు అమీతుమీ! | BJP Delhi chief Vijendra Gupta to take on Sheila Dikshit in New Delhi constituency | Sakshi
Sakshi News home page

షీలాతో బీజపీ మాజీ అధ్యక్షుడు అమీతుమీ!

Nov 6 2013 8:48 PM | Updated on Oct 17 2018 3:46 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తో అమీతుమీ తేల్చుకోవడానికి ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా సిద్ధమయ్యారు

ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తో అమీతుమీ తేల్చుకోవడానికి ఆ రాష్ట్ర  బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా సిద్ధమయ్యారు. డిసెంబర్ 4 తేదిన జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 62 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 
 
ఇప్పటికే షీలా దీక్షిత్ పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ పోటీ దిగగా, గుప్తా కూడా రంగంలోకి దూకడం రసవత్తరంగా మారింది. 
 
ఢిల్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లను అకాళీదళ్ కు కేటాయించగా, 58 స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement