'నితీశ్ నిజమైన హీరో' | BJP Ally Shiv Sena Gloats, Calls Nitish Kumar "A Hero" | Sakshi
Sakshi News home page

'నితీశ్ నిజమైన హీరో'

Nov 8 2015 3:37 PM | Updated on Jul 18 2019 2:11 PM

'నితీశ్ నిజమైన హీరో' - Sakshi

'నితీశ్ నిజమైన హీరో'

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మిత్రపక్షం బీజేపీని దెప్పిపొడుస్తూ శివసేన వ్యాఖ్యలు చేసింది

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మిత్రపక్షం బీజేపీని దెప్పిపొడుస్తూ శివసేన వ్యాఖ్యలు చేసింది. ఈ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యత వహించాలని పేర్కొంది. అదేసమయంలో బిహార్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నితీశ్‌కుమార్‌ను నిజమైన హీరోగా పేర్కొంటూ శివసేన ప్రశంసల్లో ముంచెత్తింది.

'కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతే అది సోనియాగాంధీ బాధ్యత అవుతుంది. అదేవిధంగా బిహార్ ఫలితాలను ప్రధాని మోదీ బాధ్యతగా బీజేపీ తప్పక అంగీకరించాలి' అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ పేర్కొన్నారు. 'ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు వచ్చినా ఫలితాలు ఇదేవిధంగా ఉంటాయి. ఎన్నికలకు మేం భయపడటం లేదు' అని ఆయన అన్నారు. రాజకీయ హీరోగా అవతరించిన నితీశ్‌కుమార్‌కు తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అభినందనలు తెలిపారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement