మేడారానికి హెలికాప్టర్ ప్రారంభం | Begumpet airport in Start Medaram Jatara to Helicaptor | Sakshi
Sakshi News home page

మేడారానికి హెలికాప్టర్ ప్రారంభం

Feb 19 2016 3:22 AM | Updated on Sep 3 2017 5:54 PM

మేడారానికి హెలికాప్టర్ ప్రారంభం

మేడారానికి హెలికాప్టర్ ప్రారంభం

మేడారం జాతరకు హెలికాప్టర్ సదుపాయం ప్రారంభమైంది. గురువారం నాలుగు సీట్లుండే హెలికాప్టర్ తొలిట్రిప్పును...

సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు హెలికాప్టర్ సదుపాయం ప్రారంభమైంది. గురువారం నాలుగు సీట్లుండే హెలికాప్టర్ తొలిట్రిప్పును నడిపారు. అయితే తొలిరోజు సాధారణ భక్తులెవరూ బుక్ చేసుకోలేదు. దీంతో ముందు ప్రకటించినట్టుగా సేవలు ప్రారంభించాలన్న ఉద్దేశంతో అధికారులు, పర్యాటక శాఖ మంత్రి అందులో ప్రయాణించారు. శుక్రవారం వరంగల్ నుంచి రెండు ట్రిప్పులు బుక్ అయ్యాయి. దీంతో అధికారుల్లో ఉత్సాహం కనిపించింది.

గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన హెలికాప్టర్ వరంగల్ వెళ్లి అక్కడ మంత్రి చందూలాల్‌ను తీసుకుని మేడారం చేరుకుంది. తిరిగి మేడారం నుంచి సాయంత్రం వరంగల్‌కు వచ్చింది. శుక్రవారం వరంగల్ నుంచి రెండు ట్రిప్పులు ఉన్నందున దాన్ని వరంగల్‌లోనే నిలిపారు. శనివారం మరో మూడు ట్రిప్పులు తిరిగే అవకాశముందని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement