బెంగళూరులో కొనసాగుతున్న ఆందోళన | Bangalore school rape case: Parents to protest again, boycott school | Sakshi
Sakshi News home page

బెంగళూరులో కొనసాగుతున్న ఆందోళన

Jul 18 2014 4:52 PM | Updated on Sep 2 2017 10:29 AM

బెంగళూరులో కొనసాగుతున్న ఆందోళన

బెంగళూరులో కొనసాగుతున్న ఆందోళన

ఆరేళ్ల చిన్నారిపై పాఠశాలలో అత్యాచారానికి చేసిన ఘటనపై ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి.

బెంగళూరు: ఆరేళ్ల చిన్నారిపై పాఠశాలలో అత్యాచారానికి చేసిన ఘటనపై ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు వందలాది మంది ఇతర విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజాసంఘాలకు చెందిన వారు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో భారీగా పోలీసులను మొహరించారు.

బెంగళూరులోని విబ్జియర్ హై అనే స్కూల్లో  ఈ  దారుణం జరిగింది. 1వ తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై స్కూలు స్పోర్ట్స్ టీచర్, ఫిజికల్ ఇన్స్టక్టర్లు ఈ నెల 2న అత్యాచారానికి పాల్పడ్డారు. 9వ తేదీన బాలిక తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement