థియేటర్ లో బాలకృష్ణ హల్ చల్ | BALAKRISHNA watched movie in theatre | Sakshi
Sakshi News home page

థియేటర్ లో బాలకృష్ణ హల్ చల్

Jan 12 2017 10:32 AM | Updated on Jul 14 2019 4:05 PM

థియేటర్ లో బాలకృష్ణ హల్ చల్ - Sakshi

థియేటర్ లో బాలకృష్ణ హల్ చల్

తన వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదల సందర్భంగా నందమూరి బాలకృష్ణ థియేటర్ లో సందడి చేశారు.

హైదరాబాద్: తన వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదల సందర్భంగా నందమూరి బాలకృష్ణ థియేటర్ లో సందడి చేశారు. కూకట్ పల్లిలోని 'భ్రమరాంబ' థియేటర్ లో ఆయన అభిమానులతో కలిసి సినిమా చూశారు. బాలయ్య రాకతో అభిమానులు కెరింతలు కొట్టారు. చిత్ర దర్శకుడు క్రిష్ తోపాటు ప్రముఖ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తదితరులతో కలిసి ఆయన సినిమా చూశారు.

బెనిఫిట్ షో చూసిన అభిమానులు సినిమా అద్భుతంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక గురువారం ఉదయం ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ లో చిత్ర దర్శకుడు క్రిష్, కథానాయిక శ్రియా సినిమాను ప్రేక్షకులతో కలిసి చూశారు. గొప్ప తెలుగుయోధుడిని జీవితచరిత్రను సినిమాగా మలిచామని,  ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం థ్రిల్లింగ్ గా ఉందని క్రిష్ అన్నారు.







Advertisement
 
Advertisement
Advertisement