నేపాల్ వెళ్లిన హైదరాబాదీలు సేఫ్ | all hyderabadis those went to nepal are safe | Sakshi
Sakshi News home page

నేపాల్ వెళ్లిన హైదరాబాదీలు సేఫ్

Apr 25 2015 5:26 PM | Updated on Oct 20 2018 6:37 PM

నేపాల్ వెళ్లిన హైదరాబాదీలు సేఫ్ - Sakshi

నేపాల్ వెళ్లిన హైదరాబాదీలు సేఫ్

నేపాల్ భూకంపంలో చిక్కుకున్న హైదరాబాదీలు సురక్షితంగా ఉన్నారు. ఈ విషయాన్ని టూర్ ఆర్గనైజర్ మీడియాకు తెలిపారు.

నేపాల్ భూకంపంలో చిక్కుకున్న హైదరాబాదీలు సురక్షితంగా ఉన్నారు. ఈ విషయాన్ని టూర్ ఆర్గనైజర్ మీడియాకు తెలిపారు. హైదరాబాద్ నుంచి 25 మంది యాత్రికులు నేపాల్ వెల్లారు. తామంతా ప్రస్తుతం పశుపతినాథ్ ఆలయానికి సమీపంలో ఉన్నట్లు గౌరీశంకర్ చెప్పారు. ప్రకంపనలు రాగానే అందరం రోడ్డుమీదకు వచ్చేశామని ఆయన అన్నారు. తాము ఏప్రిల్ 17వ తేదీన హైదరాబాద్ నుంచి బయల్దేరామని, కాశీ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ఖాట్మాండు వచ్చామని ఆయన వివరించారు.

కాగా, మరో 125 మంది భారతీయులు ప్రస్తుతం నేపాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుంచి 80 మంది యాత్రికులు నేపాల్ వెల్లారు. వీరిలో 20 మంది పర్వతారోహణ కోసం వెళ్లారు. వీళ్ల ఆచూకీ ఇంకా తెలియలేదు. ఎవరి ఫోన్లూ పనిచేయకపోవడంతో వీళ్ల విషయమై తీవ్ర ఆందోళన నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement